పాకిస్తాన్ లో లీటరు పెట్రోలు ఎంతో తెలుసా?

పాకిస్తాన్ లో లీటర్ పెట్రోలు ధర రూ. 262.80. పెట్రోలు, డీజిల్ పై ప్రభుత్వం 35 రూపాయలు పెంచడంతో ఈ ధరలకు చేరుకున్నాయి

Update: 2023-01-30 04:27 GMT

పాకిస్థాన్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. తిండి దొరకడమూ కష్టంగా మారింది. గోధుమపిండి పది కిలోలు మూడు వేల ఐదు వందలకు పైగానే. ధరలన్నీ నింగినంటుతున్నాయి. పేదలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ ఇప్పుడు మరో శ్రీలంకలా మారింది. శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అవే పరిస్థితలు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు.

మండిపోతున్న కిరోసిన్...
పాకిస్తాన్ లో లీటర్ పెట్రోలు ధర 262.80 రూపాయలు. పెట్రోలు, డీజిల్ పై పాకిస్తాన్ ప్రభుత్వం 35 రూపాయలు పెంచడంతో ఈ ధరలకు చేరుకున్నాయి. దీంతో నిత్యవసరాల ధరలు కూడా పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. డీజిల్ హైస్పీడ్ ధర 262.80 రూపాయలు కాగా, పెట్రోలు 249.80 రూపాయలకు చేరుకుంది. లీటర్ కిరోసిన్ 189.83 రూపాయలుగా ఉంది. అమెరికన్ డాలర్ తో పోలిస్తే పాకిస్తాన్ రూపీ 11 శాతం దిగజారింది. డాలర్ మారకంలో రూపీ విలువ 272 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News