Pakistaan : పాక్ లో తిరగబడుతున్న జనం.. నీటి కోసం రోడ్డెక్కిన పౌరులు
పాక్ ప్రజలు తిరగబడుతున్నారు. సింధూ జలాలను భారత్ నిలిపివేయడంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
పాక్ ప్రజలు తిరగబడుతున్నారు. సింధూ జలాలను భారత్ నిలిపివేయడంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. చివరకు మంత్రి నివాసాన్నికూడా ప్రజలు తగులబెట్టే పరిస్థితికి వచ్చారు. ఆర్మీని కూడా చితక్కొడుతున్న పౌరుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సింధూ జలాల కోసం సింధూ ప్రావిన్స్ లో జనం తిరగబడుతున్నారు. పహాల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ తో భారత్ దాడులు నిర్వహించింది. ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. వంద మంది వరకూ ఉగ్రవాదులను హతమార్చింది. అయినా పాక్ మాత్రం కవ్వింపు చర్యలకు దిగడంతో పాక్ సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ లపై కూడా దాడులకు దిగింది.
సింధూ జలాలను...
మరొకవైపు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. జలాలను నిలిపివేసింది. సింధూనది భారత్, పాక్ లమ మధ్య విస్తరించి ఉంది. సింధూ నదితో పాటు దాని ఉప నదులు భారత్ మీదుగా పాక్ కు వెళ్లాల్సి ఉంటుంది. సాగునీటికి, తాగునీటికి పాక్ ప్రజలు ప్రధానంగా సింధూ ప్రావిన్స్ లో ఉన్న ప్రజలు ఉపయోగించుకుంటారు. 1960 సెప్టంబరు 19వ తేదీన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాటి పాకిస్తాన్ అధ్యక్షడు అయూభ్ ఖాన్ ల మధ్య ఒప్పందం కుదిరింది. సింధూ జలాలను నిలిపివేయడంతో పాక్ లో ప్రజలకు నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో పాటు నిత్యవాసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.
దాడులకు దిగుతూ...
భారత్ -పాక్ డీజీఎంఏల మధ్య జరిగిన చర్చల్లోనూ పాక్ సింధూ జలాలను పునరుద్ధరించాలని కోరింది. అయితే భారత్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత్ ప్రధాన డిమాండ్ పెట్టింది. ఈ రెండు ఒకదానికి ఒకటి మెలికపడటంతో సింధూ జలాలు నిలిచిపోవడంతో పాకిస్తాన్ లోని సింధూ ప్రావిన్స్ లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి నివాసంపై దాడులకు దిగారు. ఆ నివాసానికి నిప్పంటించినట్లు వార్తలు వస్తునాయి. సైనికులను కూడా తరిమి కొడుతున్న పౌరుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సింధూ జలాలను నిలిపివేయడంతో పాక్ లోని సింధూ ప్రావిన్స్ లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాక్ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా పరిస్థితులు తయారయ్ాయి. సింధ్ ప్రావిన్స్‌లో హింస చెలరేగింది. సింధ్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిపై దాడులు జరిగాయి. హోంమంత్రి ఇంటిని తగలబెట్టిన ఆందోళనకారులు అడ్డుకునేందుకు పోలీసుల యత్నించారు. పోలీసులపైనా ఆందోళనకారులు దాడికి దిగారు. పోలీసుల కాల్పుల్లో ఆందోళనకారుడు మృతి చెందారు.