Pakistan : పాకిస్తాన్ ను ఇంకా వంచాల్సిదే.. దాయాదిపై దయ అనవసరం

పాకిస్తాన్ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంది. ఆ దేశం కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు

Update: 2025-05-19 02:43 GMT

పహాల్గామ్ దాడి ఏ ముహూర్తాన జరిగిందో తెలియదు కానీ పాకిస్తాన్ మాత్రం అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంది. ఆ దేశం కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఇటు దేశంలో వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. మరొకవైపు భారత్ సింధూ జలాలను నిలిపివేయడంతో పాక్ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలు రొట్టెల కోసం క్యూ లో నిల్చోవడంతో పాటు ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇక నిత్యవసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కొనుగోలు శక్తి తగ్గిపోవడం, ధరలు పెరగడంతో పాటు పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్న సమయంలోనే పహాల్గామ్ లోఉగ్రదాడి జరగడంతో భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ మరింత పరిస్థితిని దిగజార్చింది.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షరతులతో...
ఇక తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాక్ కు ఒక బిలియన్ డాలర్ల నిధులను రుణంగామంజూరు చేసింది. దీని విలువ సుమారు8,540 కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే ఈ నిధులు మంజూరు చేయడానికి కూడా ఐఎంఎఫ్ అనేక షరతులను విధించింది. దాదాపు యాభైకి పైగానే షరతులు విధించింది. ఈ షరతులు చూస్తే ఈ మాత్రం దానికి ఆ నిధులు తీసుకోవడం అవసరమా? అని అనిపించేంతగా. దీంతో పాటు భారత్ తో కయ్యం పెంచుకోవడం వల్ల ఇంకా సమస్యలు ఎదుర్కొనే అవకాశముందని కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ హెచ్చరించింది. భారత్ ఐఎంఎఫ్ పైతో పాటు అంతర్జాతీయ సమాజంపై తీసుకు వచ్చిన వత్తిడి కారణంగానే ఈ షరతులు విధించినట్లు చెబుతున్నారు.
వత్తిడి ఎదుర్కొనుందా?
ఐఎంఎఫ్ నివేదికలో ప్రధానమైనది పాక్ వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న రక్షణ బడ్జెట్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్ లో 2,414ట్రిలియన్లుగా ప్రవేశపెట్టనుంది. అంటే ఈ నిధులను ఉగ్రవాదులకు తోడ్పాటుకు అందించేందుకు కాకుండా తమ రక్షణ అవసరావలకు వినియోగించే వీలుందని చెప్పింది. గత ఏడాదితో ఈ ఏడాది పాక్ రక్షణ బడ్జెట్ 252 బిలియన్లు అధికం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పెట్టిన షరతులతో పాక్ మరింత ఇబ్బందులు పెట్టే అవకాశముంది. మరొక వైపు ఉగ్రవాదులు, ఐసిస్ నుంచి కూడా పాక్ ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొనాల్సి ఉంటుంది. పాపం పాక్.. భారత్ తో పెట్టుకుని చివరకు పాక్ పరిస్థితి ఇలా తయారయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News