48 గంటల్లో 20 భూకంపాలు.. భారీ భూకంపం పొంచి ఉందా?

ఆదివారం రాత్రి నుండి, పాకిస్తాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీలో

Update: 2025-06-05 04:17 GMT

ఆదివారం రాత్రి నుండి, పాకిస్తాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీలో 20కి పైగా స్వల్ప భూకంపాలు సంభవించాయి. ఇది తీవ్ర ఆందోళన, గందరగోళానికి దారితీసింది. కరాచీలో 48 గంటల్లోపు 21 తక్కువ నుండి మితమైన తీవ్రత కలిగిన ప్రకంపనలు నమోదయ్యాయి. 2.1 నుండి 3.6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. అయితే ప్రమాదకరమైన భూకంపం వచ్చే అవకాశం ఉందేమోనని భయం వెంటాడుతూ ఉంది.

ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన భూకంపం ఆదివారం రాత్రి 3.6 తీవ్రతతో సంభవించింది. మాలిర్ జైలు గోడ పాక్షికంగా కూలిపోవడానికి కారణమవ్వడంతో 216 మంది ఖైదీలు తప్పించుకోవడానికి వీలు కల్పించింది. పాకిస్తాన్ వాతావరణ శాఖ (PMD) ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరినప్పటికీ, కొన్ని స్వతంత్ర సంస్థలు మాత్రం ప్రమాదం పొంచి ఉందని అంటున్నాయి. "తేలికపాటి భూకంప ప్రకంపనలు రాబోయే రెండు, మూడు రోజులు కొనసాగుతాయి. భూకంపాల తీవ్రత తగ్గినందున పరిస్థితి మెరుగుపడుతుంది" అని PMD డైరెక్టర్ జనరల్ మహర్ సాహిబ్జాద్ ఖాన్ ప్రజలకు భరోసా ఇచ్చారు.


Tags:    

Similar News