పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరుల మృతి

భారత్ చేపట్టిన ఆపరేషన్ కు సింధూర్ కు వ్యతిరకేంగా పాకిస్థాన్ కూడా కవ్వింపు చర్యలకు దిగింది

Update: 2025-05-07 01:37 GMT

భారత్ చేపట్టిన ఆపరేషన్ కు సింధూర్ కు వ్యతిరకేంగా పాకిస్థాన్ కూడా కవ్వింపు చర్యలకు దిగింది. పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ దాడులకు దిగితే అయితే పాకిస్థాన్ మాత్రం నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు తెలిసింది. పాక్ సైన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుండటంతో ముగ్గురు భారత పౌరులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

తాము బదులు తీర్చుకుంటామంటూ...
తాము ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపితే పాక్ మాత్రం తిరిగి పౌరుల ను టార్గెట్ చేసిందని భారత సౌన్యం తెలిపింది. ముగ్గురు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనిందని తెిపింది. దీనికి బదులు తీర్చుకుంటామని భారత సైన్యం తెలిపింది. ఇప్పటికే భారత్ త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. భారత్ కవ్వింపు చర్యలకు దిగినా అందుకు పాక్ లోని పౌరుల మీద తీర్చుకోకూడదని ఇప్పటి వరకూ భారత్ ఓపిక పడుతూ వచ్చింది.


Tags:    

Similar News