ఒక్కరోజులోనే లక్ష కేసులు.. వణుకుతున్న ఫ్రాన్స్

ఫ్రాన్స్ లో ఒక్క రోజులోనే లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 1,04,611 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది.

Update: 2021-12-26 04:23 GMT

ఫ్రాన్స్ లో ఒక్క రోజులోనే లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 1,04,611 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. కొన్ని రోజులుగా ఫ్రాన్స్ లో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతుండటంతో థర్డ్ వేవ్ అని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. థర్డ్ వేవ్ మొదలయినట్లేనని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆంక్షలను మరింత కఠినతరం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

బూస్టర్ డోస్ కు....
ఫ్రాన్స్ లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 1,22,546 మంది మరణించారు. కరోనా తీవ్రత ఎక్కువ అవుతుండటంతో ఫ్రాన్స్ ప్రభుత్వం బూస్టర్ డోస్ కు అనుమతిచ్చింది. ఇప్పటి వరకూ ఫ్రాన్స్ లో 77 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆ దేశం ప్రకటించింది. పరీక్షల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.


Tags:    

Similar News