57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్.. హై అలెర్ట్

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటి వరకూ ఒమిక్రాన్ వేరియంట్ 57 దేశాలకు విస్తరించింది

Update: 2021-12-08 03:39 GMT

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటి వరకూ ఒమిక్రాన్ వేరియంట్ 57 దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందన్న నిపుణల హెచ్చరికతో ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒమిక్రాన్ కేసులు దేశాల్లోకి ప్రవేశిస్తున్నాయి. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ 57 దేశాలకు విస్తరించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సయితం అప్రమత్తమయింది.

సౌతాఫ్రికా కంటే ‍యూకేలోనే....
అన్ని దేశాలూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, వ్యాక్సినేషన్ ను వేగంగా పూర్తి చేయాలని కోరింది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ యూకేలో 437, డెన్మార్క్ లో 398, దక్షిణాఫ్రికాలో 255, అమెరికలో యాభై, జింబాబ్వేలో 50, భారత్ లో 23 కేసులున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టిన సౌతాఫ్రికాలో కంటే యూకేలోనే ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై త్వరలో కఠిన ఆంక్షలు విధించే ఆలోచనలో పలు దేశాలున్నాయి.


Tags:    

Similar News