కరోనా ఎఫెక్ట్.. పీఎం పెళ్లి రద్దు

కరోనా తీవ్రత పెరగడంతో న్యూజిల్యాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

Update: 2022-01-23 04:00 GMT

కరోనా సమయంలో ఆంక్షలు కఠినంగా మారాయి. సామాన్యుల నుంచి ప్రధానమంత్రుల వరకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయి. పెళ్లిళ్లు, సామూహిక సమావేశాలకు అన్ని దేశాలు కొన్ని ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. న్యూజిల్యాండ్ లోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ దేశంలో ఆంక్షలను కఠినతరం చేశారు. అయితే న్యూజిల్యాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

కరోనా తగ్గిన తర్వాత....
న్యూజిల్యాంద్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ గత కొంత కాలంగా క్లార్గ్ గేఫోర్డ్ తో సహజీవనం చేస్తున్నారు. ఆయనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం, దేశంలో ఆంక్షలు విధించడంతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటించారు. అందరిలాగే తాను ఆంక్షలను గౌరవించాలని ఆమె పేర్కొన్నారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత పెళ్లి తేదీని ప్రకటిస్తామని జసిండా ఆర్డెర్న్ తెలిపారు.


Tags:    

Similar News