ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలు
ఇండోనేషియాలోని జావా ఐల్యాండ్లో మౌంట్ సెమెరు అగ్నిపర్వతం బద్దలైంది
ఇండోనేషియాలోని జావా ఐల్యాండ్లో మౌంట్ సెమెరు అగ్నిపర్వతం బద్దలైంది. ఆకాశంలో పదమూడు కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద వెదజల్లుతోంది. వేడి వాయువు, బూడిద, రాతి శకలాలతో కూడిన 'పైరో క్లాస్టిక్' ప్రవాహం సమీప ప్రాంతాలను ముంచెత్తుతోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నివాసాలను ఖాళీ చేసి వెళుతున్నారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు...
దాదాపు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అగ్నిపర్వత విస్ఫోటనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్ని పర్వతాలు బద్దలవ్వడం సాధారణమే అయినప్పటికీ వేడమికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఉండలేక అక్కడ నివాసాలను ఖాఈ చేసి వెళుతున్నారు.