మిస్ వరల్డ్ గా థాయ్ లాండ్ సుందరి

ప్రపంచ సుందరిగా థాయ్ లాండ్ సుందరి ఎంపికయ్యారు.

Update: 2025-05-31 16:30 GMT

ప్రపంచ సుందరిగా థాయ్ లాండ్ సుందరి ఎంపికయ్యారు. 2025 మిస్ వరల్డ్ గా ఓపల్ సుచాత ఎన్నికయ్యారు. 72 వ మిస్ వరల్డ్ గా ఎంపియ్యారు. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో మిస్ వరల్డ్ గా ఓపల్ సుచాత నిలిచారు. ఆమెకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిరీటాన్ని ధరింపచేశారు. మిస్ వరల్డ్ గా ఎన్నికయిన ఓపల్ సుజాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.

రన్నర్ అప్ గా
దీంతో పాటు వజ్రాలతో పొదగబడిన కిరీటం దక్కుతుంది. అంతేకాకుండా ఈ ఏడాది మొత్తం ప్రపంచదేశాలన్నీ ఉచితంగా పర్యటించే అవకాశం లభిస్తుంది. వివిధ ప్రకటనలు, చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కుతాయి. ఉత్కంఠగా సాగిన . టాప్-4లో మార్టినిక్, ఇథియోపియా, పోలెండ్, థాయిలాండ్ దేశాల అందగత్తెలు నిలవగా.. ఓపల్ అత్యుత్తమ సమాధానం చెప్పి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. సుచాత థాయిలాండ్లోని ఫుకెట్లో జన్మించారు.


Tags:    

Similar News