Earth Quake : మెక్సికోలో భారీ భూకంపం

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది.

Update: 2025-08-11 04:20 GMT

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.65 తీవ్రతతో నమోదయింని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ అధికారులు తెలిపారు. ఒక్సాకా తీరానికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది. భూకంపం పది కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు వెల్లడించారు. భారీ భూకంపంతో ప్రజలు భయంతో వణికిపోయారు.

ప్రాణ, ఆస్తినష్టంపై...
అయితే ఈ భూకంపం కారణంగా ఎంత మేరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించిందన్న విషయం అధికారులు పూర్తి వివరాలను తెలియజేయలేదు.అయితే సహాయక చర్యలను మాత్రం ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News