Breaking : నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా
యెమెన్లో రేపే కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరి శిక్ష వాయిదా పడింది
యెమెన్లో రేపే కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరి శిక్ష వాయిదా పడింది నిమిషను ఇప్పటికే రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. యెమన్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. వాస్తవానికి నిమిష ప్రియ ఉరిశిక్షను రేపు అమలు చేయాల్సి ఉంది. ఈ నెల 16వ తేదీన అమలు కానున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గంటలు మాత్రమే సమయం...
ఇక గంటలు మాత్రమే సమయం ఉంది. కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు యెమన్ ప్రభుత్వం తెలిపింది. నిమిష ప్రియ యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిందితురాలిగా నిర్ధారించింది. దీంతో మరికొద్ది గంటల్లో అమలు చేయాల్సిన సమయంలో యెమన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాత్కాలిక ఊరట కలిగించింది.