బూస్టర్ డోస్ తీసుకున్నా.. ఒమిక్రాన్ సోకింది

బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ సోకడం కలవరపెడుతోంది

Update: 2021-12-10 12:14 GMT

బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ సోకడం కలవరపెడుతోంది. సింగపూర్ లో ఇటీవలే ఇద్దరికి మూడవ బూస్టర్ డోస్ ఇచ్చారు. బూస్టర్ డోస్ ద్వారా కరోనా నుంచి రక్షణ లభిస్తుందని అందరూ భావించగా.. అది కాస్తా రివర్స్ అయింది. 24 ఏళ్ల మహిళా ఎయిర్ పోర్ట్ ప్యాసింజర్ సర్వీస్ వర్కర్ కు మూడవ డోస్ తీసుకున్నాక ఒమిక్రాన్ సోకింది. సింగపూర్ లో నమోదైన ఒమిక్రాన్ తొలి కేసు ఇదే కాగా.. డిసెంబర్ 6వ తేదీన జర్మనీ నుంచి తిరిగి వచ్చిన మరో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ నిర్థారణ అయింది. ఈ విషయాన్నిఅక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. ఒమిక్రాన్ సోకిన వీరిద్దరికీ మూడవ డోస్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

గ్యారంటీ లేదు.....
ఒమిక్రాన్ ను ఎదుర్కోవాలంటే మూడవ డోస్ వ్యాక్సిన్లు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో బూస్టర్ డోస్ లు తీసుకున్న వారికి ఒమిక్రాన్ సోకడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. కానీ.. వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నవారికి ఒమిక్రాన్ సోకదన్న గ్యారెంటీ లేదని నిపుణులు చెప్తున్నారు. మూడవ డోస్ తీసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ తో పోరాడే ప్రతిరోధకాలను తటస్థీకరించడంలో 25 రెట్లు తగ్గింపు ఉంటుందని తమ అధ్యయనాల్లో తేలిందని చెప్తున్నారు.


Tags:    

Similar News