Nigeria : నైజీరియాలో ఊచకోత.. 160 మంది మృతి
నైజీరియాలో జరిగిన దాడుల్లో దాదాపు 160 మందికి పైగానే మరణించనట్లు తెలుస్తోంది.
160 people died in the attacks in nigeria
నైజీరియాలో జరిగిన దాడుల్లో దాదాపు 160 మందికి పైగానే మరణించనట్లు తెలుస్తోంది. నైజీరియాలో బందిపోట్ల ముఠాలు ఈ దాడులకు తెగబడ్డాయి. అధికారులు ఈ మేరకు ప్రకటన చేశారు. 160 మంది వీరి దాడుల్లో చనిపోగా మూడు వందలకు పైగా గాయాలపాలపై ఆసుపత్రి పాలయినట్లు అధికారులు వెల్లడించారు. సెంట్రల్ నైజీరియాలోని అనేక గ్రామాలపై సాయుధులైన బందిపోట్ల ముఠాలు ఈ దాడులకు తెగబడ్డాయి.
దాడులకు తెగబడటంతో...
అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు. మతపరమైన, జాతి ఉద్రిక్తతలతో అనేక ఏళ్లుగా జరుగుతున్న ఈ పోరాటంలో అత్యధికంగా మరణించినట్లు అధికారులు లెక్కలు వేసి చెబుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 113 మంది మరణించినట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేసి చికిత్స అందిస్తున్నారు. భద్రతబలగాలు వెంటనే చర్యలు తీసుకుని ఈ దాడులను ఆపాలని కోరుతున్నారు.