ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్... కువైట్ లోనూ మిస్సైల్ దాడులు
తమ దేశంపై ఇరాన్ జరిపిన మిస్సైల్, డ్రోన్ దాడులను కువైట్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది
తమ దేశంపై ఇరాన్ జరిపిన మిస్సైల్, డ్రోన్ దాడులను కువైట్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ఇరాన్ రాయబారి మహ్మద్ తౌటౌంజీని పిలిపించితమ నిరసనను గట్టిగా తెలియజేసింది. ముఖ్యంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడులను 'హీనమైన చర్య'గా కువైట్ అభివర్ణించింది. పౌర సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడం మరియు ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం అంతర్జాతీయ మానవతా చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
బుర్జ్ ఖలీఫా ఖాళీ...
ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆర్టికల్ 51 ప్రకారం.. ఇలాంటి దురాగతాలను తిప్పికొట్టేందుకు మరియు తమను తాము రక్షించుకునేందుకు కువైట్‌కు పూర్తి హక్కు ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం తన భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది.తమ దేశంపై జరిపిన దాడులకు ప్రతీకారంగా.. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తున్న ఇరాన్ దుబాయ్ మీద కూడా మిసైళ్ళ వర్షం కురిపిస్తున్న తరుణంలో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫాను అధికారులు ఖాళీ చేయించారు.సైరన్లు మోగించి అందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
విమానాశ్రయాలు మూత...
ఇప్పటికే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మూతపడింది. దుబాయ్ లోని పలు ప్రాంతాల్లో ఇరాన్ మిస్సెళ్ల వర్షం కురిసింది. పామ్ జుమైరా హోటల్ పై మిస్సైల్ తో ఇరాన్ దాడి చేసిందని ఆ దేశం ప్రకటించింది. దాడి సమయంలో హోటల్ లో 1700 మందికిపైగా పర్యాటకులుు ఉన్నట్లు సమాచారం. దుబాయ్ లోని బుర్జు ఖలీఫాను అధికారులు ఖాళీ చేయించారు. దుబాయ్ లోని అన్ని ఎయిర్ పోర్టుల మూసివేవారు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని దుబాయ్ ప్రభుత్వం సూచించింది. అరబ్ ఎమిరేట్స్ కు సంబంధించిన అన్ని ఎయిర్ పోర్టులు మూసివేశారు. ఇతర దేశాల నుంచి ఈ ఎయిర్ పోర్టులకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.