నేడు వాటికన్ సిటీకి భారత రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు వాటికన్ సిటీలో పర్యటించనున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు వాటికన్ సిటీలో పర్యటించనున్నారు. నేడు పోప్ ప్రావిన్స్ అంత్యక్రియల్లో భారత రాష్ట్రపతి పాల్గొంటారు. పోప్ ఫ్రాన్సిస్ ఈ నెల 21వ తేదీన మరణించిన నేపథ్యంలో నేడు వాటికన్ సిటీలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి అనేక మంది నేతలు, దేశాధినేతలతో పాటు అభిమానులు కూడా పాల్గొననున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో...
పోప్ ఫ్రాన్సిస్ ఈ నెల 21వ తేదీన వాటికన్ సిటీలో ఆయన మృతి చెందారు. ఈస్టర్ సందర్భంగా సందేశం ఇచ్చిన పోప్ ఫ్రాన్సిస్ భౌతికంగా దూరం కావడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన వయసు ఎనభై ఎనిమిదేళ్లు. గత కొద్ది రోజులుగు పోప్ ఫ్రాన్సిస్ శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.