America : వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా హైదరాబాదీ.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన హష్మి
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా డెమోక్రాట్ గజాలా హష్మీ విజయం సాధించారు
అమెరికాలో హైదరాబాదీకి చెందిన మహిళ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా డెమోక్రాట్ గజాలా హష్మీ విజయం సాధించారు. అమెరికాలో హైదరాబాద్ కు చెందిన మహిళ, గవర్నర్ గా దేశంలోని ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా గజాలా హష్మీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. హైదరాబాద్ కు చెందిన గజాలా హష్మీ చిన్నతనంలోనే కుటుంబ సభ్యులతో కలసి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. జార్జియాలో తల్లి, సోదరుడితో కలసి గజాలా హష్మీ కొంతకాలం అక్కడే ఉన్నారు. అక్కడే చదువు కున్నారు.
బీఏ చదివి...
గజాలా హష్మీ తండ్రి యూనివర్సటీలో అధ్యాపకుడిగా ఉన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయన పీ.హెచ్.డి. చేశారు. గజాలా హష్మీ కూడా చదువు పట్ల ఆకర్షితులయ్యారు. చిన్ననాటి నుంచి చదువు మీద శ్రద్ధ కనపర్చే గజాలా హష్మీ జార్జియా సదరన్ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్ ను పూర్తి చేశారు. అనేక స్కాలర్ షిప్ లతో పాటు ప్రోత్సాహకాలు కూడా గజాలా హష్మీ అందుకున్నారు. తర్వాత గజాలా హష్మీ రాజకీయాలపై ఆసక్తి ని పెంచుకున్నారు. ఇందుకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉంది.
రాజకీయాలపై ఆసక్తితో...
గజాలా హష్మీ వివాహం అజహర్ తో జరిగింది. తర్వాత గజాలా హష్మీ రిచ్ మండ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ దాదాపు మూడు దశాబ్దాల నుంచి రేనాల్డ్స్ కమ్యునిటీ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేశారు. అప్పుడే రాజకీయాలపై ఆసక్తిని పెంచుకన్న గజాలా హష్మీ 2019 లో తొలిసారి అమెరికాలో జరిగిన ఎన్నికలలో పోటీ చేశారు. 2024లో ఆమె సెనేట్ విద్య, వైద్య కమిటీ ఛైర్ పర్సన్ గా డెమోక్రటిక్ పార్టీ తరుపున ఎన్నికయ్యారు. తాజాగా వర్జీనియా గవర్నర్ గా ఎన్నికై హిస్టరీని క్రియేట్ చేశారు. గజాలా హష్మీకి తెలుగు ప్రజలు అభినందనలు చెబుతున్నారు.