Srilanka : శ్రీలంకలో దిత్వా తుపాను ఎఫెక్ట్.. వందలాది మంది గల్లంతు

శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాను కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మరణించారు.

Update: 2025-11-29 12:06 GMT

శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాను కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు 123 మంది మరణించారని అధికారులు తెలిపారు. దిత్వా తుపాను నేపథ్యంలో ఆ దేశంలో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా చనిపోయినవారి సంఖ్య 123కు చేరింది.

130 మంది ఆచూకీ తెలియక...
వరదల కారణంగా 130 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వరదల్లో గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. నలభై మూడు వేల మంది నిరాశ్రయులయ్యారని, 3,73,000 మంది జీవనం స్తంభించిపోయిందని చెప్పారు. అత్య వసర సహాయం కోసం అమెరికా $2 మిలియన్ల ఆర్థిక సాయం ప్రకటించింది. శ్రీలంకకు భారత్ ఇప్పటికే తనవంతు సాయం అందజేసింది.


Tags:    

Similar News