Hamas : హమాస్ అగ్రనేత హతం.. మళ్లీ యుద్ధం తీవ్రతరం
హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరి మృతి చెందారు. ఇజ్రాయిల్ జరిపిన డ్రోన్ దాడిలో ఆయన మరణించినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి
hamas leader saleh arauri has died.
హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరి మృతి చెందారు. ఇజ్రాయిల్ జరిపిన డ్రోన్ దాడిలో ఆయన మరణించినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ఈ దాడిలో మొత్తం ఆరుగురు హమాస్ తీవ్రవాదులు మరణించగా అందులో సలేహ్ అరౌరీ ఒకరు. లెబనాన్ రాజధాని బీరుట్ ప్రాంతంలో ఈ దాడి జరిపినట్లు ఇజ్రాయిల్ కు చెందిన అధికార వార్తా సంస్థ వెల్లడించడం గమనార్హం.
అధికారిక ప్రకటన మాత్రం....
హమాస్ మిలిటెంట్ వ్యవస్థాపకుల్లో సలేహ్ అరౌరీ ఒకరు. ఆయన మరణంతో హమాస్ కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అయితే అరౌరీ డ్రోన్ దాడిలో మరణించిన నేపథ్యంలో హమాస్ తీవ్రవాదులు విరుచుకుపడే అవకాశముందని కూడా ఇజ్రాయిల్ భావిస్తుంది. మొత్తం మీద ఇజ్రాయిల్ లో అరౌరీ మరణం తర్వాత మరింత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయని చెప్పాలి.