గోధుమ ఎగుమతులను నిషేధించిన భారత్.. కారణాలివి !

2010 తర్వాత భారత్ లో గోధుమల ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. రిటైల్ మార్కెట్లో కిలో గోధుమల ధర రూ.32.38కి చేరింది. గతేడాదితో పోల్చితే..

Update: 2022-05-14 10:11 GMT

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల కొరత.. గ్లోబల్ మార్కెట్లో గోధుమల రేట్లు పెరుగుదల, దేశంలో గోధుమ పంట దిగుబడి తగ్గుదల ప్రభావం భారత్ పై పడుతోంది. ఫలితంగా దేశంలో గోధుమల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. డిమాండ్ కు తగిన పంటదిగుబడి లేని సమయంలో.. ఇక్కడ పండిన గోధుమలను ఎగుమతి చేస్తే భారత్ లో ఆహార భద్రత సంక్షోభం ఏర్పడుతుందని కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. తక్షణమే దీనిని అమలు చేస్తూ.. డైరెక్టోరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల్లో గోధుమల ఎగుమతుల నిషేధాలకు సంబంధించి మినహాయింపులు కూడా ఉన్నాయి. ఉత్తర్వులు వచ్చే సమయానికి లెటర్ ఆఫ్ క్రెడిట్‌పై జరిగిన ఒప్పందాల మేరకు ఎగుమతులకు అనుమతి ఉంటుందని DGFT తెలిపింది. అలాగే ఇతర దేశాల ఆహార భద్రతా అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆయా దేశాలకు ఎగుమతులుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
2010 తర్వాత భారత్ లో గోధుమల ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. రిటైల్ మార్కెట్లో కిలో గోధుమల ధర రూ.32.38కి చేరింది. గతేడాదితో పోల్చితే.. ఈ ఏడాది ధర 9.15 శాతం పెరిగింది. దేశంలో అత్యధికంగా పోర్టుబ్లెయిర్ లో కిలో గోధుమల ధర రూ.59కి చేరింది. గ్లోబల్ మార్కెట్ కు వచ్చే గోధుమ ఉత్పత్తుల్లో 25 శాతం ఎగుమతి చేసే రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతుండటంతో సప్లై నిలిచిపోయింది. ఈ తరుణంలో ప్రపంచంలో గోధుమల ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచిన భారత్ వైపు ఆ దేశాలు చూస్తున్నాయి. ఇతర దేశాలకు గోధుమలు తరలిస్తే దేశంలో ఆహార సంక్షోభం వస్తుందని.. ముందు జాగ్రత్తగా గోధుమల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.


Tags:    

Similar News