ఒక్కరోజులోనే రెండు లక్షల కరోనా కేసులు...?

ఫ్రాన్స్ కరోనాతో భయపడిపోతుంది. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండటమే ఇందుకు కారణం.

Update: 2021-12-30 03:05 GMT

ఫ్రాన్స్ కరోనాతో భయపడిపోతుంది. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండటమే ఇందుకు కారణం. థర్డ్ వేవ్ వచ్చినట్లేనని అధికారులు సయితం భావిస్తున్నారు. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి.

ఒమిక్రాన్ కూడా....
తాజాగా ఫ్రాన్స్ లో రెండు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశ ఆరోగ్య శాఖ ఆంక్షలపై దృష్టి పెట్టాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. ఫ్రాన్స్ ఇటు డెల్టా వేరియంట్, అటు ఒమిక్రాన్ వేరియంట్ తో ఒత్తిడికి లోనవుతుంది. లక్షల మంది కరోనా బారిన పడుతుండటంతో వారిలో అత్యధికంగా హోం ఐసొలేషన్ లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News