ఆ టైమ్ లో చేపలు పడుతున్నా.. హైదరాబాద్ కు వచ్చేయాలన్నారు: చార్లెట్‌ గ్రాంట్‌

అనూహ్యంగా ప్రపంచ సుందరి పోటీల నుంచి మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ వైదొలిగారు.

Update: 2025-05-26 10:20 GMT

అనూహ్యంగా ప్రపంచ సుందరి పోటీల నుంచి మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ వైదొలిగారు. ఆమె స్థానంలో మిస్‌ ఇంగ్లాండ్‌ ఫస్ట్‌ రన్నరప్‌ చార్లెట్‌ గ్రాంట్‌ వచ్చారు. అనూహ్యంగా వచ్చిన అవకాశంపై చార్లెట్‌ గ్రాంట్‌ ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా తెలంగాణ ఆతిథ్యంపై ప్రశంసలు కురిపించారు.


ఇక్కడ ఏర్పాటు చేసిన వేడుకలు, సంబరాలు చూస్తుంటే ముచ్చటేస్తోందని అన్నారు. చేపలు పడుతుండగా ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనాలనే సమాచారం వచ్చిందని, ఎంతో సంతోషపడ్డానని చార్లెట్‌ గ్రాంట్‌ చెప్పారు. తెలంగాణ సంప్రదాయ వస్త్రాలతో పాల్గొనడం కొత్తగా అనిపించిందని, ఇప్పటికే పలు పోటీలు పూర్తీ కాగా, రానున్న పోటీల్లో వందశాతం కృషి చేస్తానని చార్లెట్‌ గ్రాంట్‌ తెలిపారు.

Tags:    

Similar News