Earth Quake : టర్కీలో భూకంపం... రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.2

టర్కీ, ఈజిప్ట్ సిరియా, గ్రీన్ దేశాల్లో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదయింది

Update: 2025-06-03 04:36 GMT

టర్కీ, ఈజిప్ట్ సిరియా, గ్రీన్ దేశాల్లో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదయింది. ఈ ప్రాంతాల్లో భూమి ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలో బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు.

భయంతో పరుగులు తీస్తూ...
ఈరోజు తెల్లవారుజామున 3.17 నిమిషాలకు భూకంపం సంభవించిందని, టర్కీలో దీని తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణ, ఆస్తినష్టంపై వివరాలు అందాల్సి ఉంది. అధికారులు మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News