Earthquake : భూకంపం.. తొమ్మిది మంది మృతి

దక్షిణ ఆప్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున సంభవింఛన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6 గా నమోదయింది. తొమ్మిది మంది మరణించారు

Update: 2025-09-01 03:11 GMT


దక్షిణ ఆప్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున సంభవింఛన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదయింది. భూకంపం ధాటికి తొమ్మిది మంది చనిపోయారు. ఈ భూకంపం తీవ్రత కారణంగా పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఆస్తి నష్టం ఎంత జరిగిందన్నది తెలియరాలేదు.

ఉత్తర భారత దేశంలోనూ...

దక్షిణ ఆప్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంప తీవ్రతతో దాని ప్రభావం పాకిస్తాన్ లోనూ, భారత్ లోని ఉత్తర ప్రాంతంలోనూ స్వల్పంగా కనిపించాయి. ఢిల్లీ ఎస్.సి.ఆర్ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు సంభవించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈరోజు తెల్లవారు జామున భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలోనుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.
Tags:    

Similar News