భారీ భూకంపం.. 70 మంది దుర్మ‌ర‌ణం

నేపాల్‌లో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది.

Update: 2023-11-04 01:36 GMT

నేపాల్‌లో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా న‌మోదైంది. భూప్ర‌కంప‌న‌ల ధాటికి ఇప్పటివరకు 70 మంది చనిపోయారు. నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం జాజర్‌కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో ఉంది.

జాజర్‌కోట్‌కు చెందిన ఓ స్థానిక అధికారి మాట్లాడుతూ.. ఇక్కడ 34 మంది మరణించినట్లు తెలిపారు. గాయపడిన క్ష‌త‌గాత్రుల‌ను జిల్లా ఆసుపత్రిలో చేర్చిన‌ట్లు వెల్ల‌డించారు. జాజర్‌కోట్ పొరుగున ఉన్న రుకుమ్ వెస్ట్ జిల్లాలో సుమారు 36 మరణాలు నమోదయ్యాయని వెల్ల‌డించారు.

దేశంలోని భద్రతా సంస్థలు గాయపడిన వారికి, బాధితులకు అండ‌గా.. స‌హాయ‌క‌చ‌ర్య‌ల్లో పాల్గొంటుంద‌ని నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ చెప్పారు. చాలా మంది ప్రజలకు గాయాలవ‌డంతో పాటు.. వారి ఆస్తులకు నష్టం జరిగినట్లు నివేదికలు ఉన్నాయ‌ని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం తీవ్ర‌త డైలేఖ్, సల్యాన్, రోల్పా జిల్లాలలో కూడా ఎక్కువ ప్ర‌భావం చూపింది.  

Tags:    

Similar News