15 వేలు దాటిన టర్కీ, సిరియా భూకంప మృతుల సంఖ్య

శిథిలాల కింద కనిపిస్తున్న అనేక దృశ్యాలు హృదయ విదారకంగా ఉంటున్నాయి. శిథిలాల కిందినుంచి పెద్దసంఖ్య మృతదేహాలు..

Update: 2023-02-09 03:31 GMT

turkey syria earthquake death tolls

టర్కీ, సిరియా దేశాల్లో భూకంప మృతుల సంఖ్య.. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ పెరుగుతోంది. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో రెండు దేశాల సరిహద్దుల్లో వచ్చిన భూకంపం తీవ్ర విషాదం నింపింది. ఆ తర్వాత 24 గంటల్లో.. 300 సార్లకంటే ఎక్కువగానే భూమి కంపించింది. అనూహ్యంగా సంభవించిన ఈ ప్రకృతి విపత్తుల్లో వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. టర్కీలో 60 వేల రెస్క్యూ సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా సహాయచర్యలు కొనసాగిస్తున్నాయి.

శిథిలాల కింద కనిపిస్తున్న అనేక దృశ్యాలు హృదయ విదారకంగా ఉంటున్నాయి. శిథిలాల కిందినుంచి పెద్దసంఖ్య మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని. కాగా, ఇరుదేశాల్లో భూకంప మృతులు 20 వేలకుపైగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. దాదాపు 2.3 కోట్ల మందిపై భూకంపం ప్రభావం చూపిందని, ఇది తీవ్రమైన సంక్షోభమని డబ్ల్యూహెచ్ఓ అధికారి పేర్కొన్నారు. భారత్‌ నుంచి టర్కీకి వెళ్లిన మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతమైన నూర్దగీలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అలాగే ఆర్మీ మెడికల్ బృందాలు క్షతగాత్రులకు వైద్యసాయం అందిస్తున్నాయి.




Tags:    

Similar News