మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ క్లారిటీ విన్నారా?

Update: 2025-05-25 14:20 GMT

తెలంగాణపై గౌరవం పెరిగిందని, అతిథ్యం బాగుందని.. అయితే తాము దేనికి వచ్చామో అర్థం అవ్వలేదని, అందుకే వైదొలిగానని మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ తెలిపారు. మిల్లా మాగీ బ్రిటిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ అనే మిస్‌ వరల్డ్‌ నినాదం పాతగా ఉందని, పోటీదారులు అల్పాహారం సమయంతో సహా అన్ని వేళల్లో మేకప్, బాల్‌ గౌన్లు ధరించాలన్నారు.


సాయంత్రం కార్యక్రమాల్లో టేబుళ్లపై పురుష స్పాన్సర్లు, అతిథులు అంటూ నలుగుర్ని, మాలో ఇద్దర్ని కేటాయించి అలరించాలన్నారని మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేసింది. విలువలు లేని చోట మనసు చంపుకొని ఉండలేనని నాకు నేనే పోటీల నుంచి తప్పుకొంటున్నా అని మీడియాకు తెలిపింది మిల్లా మాగీ. 74 సంవత్సరాల మిస్‌ వరల్డ్‌ చరిత్రలో పోటీల నుంచి అర్ధాంతరంగా వైదొలగడం ఇదే మొదటిసారి అని యూకే మీడియా తెలిపింది.

Tags:    

Similar News