Corona : మళ్లీ దూసుకొస్తున్న కరోనా.. మాస్క్ లు మళ్లీ మొదలు
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మళ్లీ మొదలయింది. ఆసియా దేశాలలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి మొదలయింది
corona virus
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మళ్లీ మొదలయింది. ఆసియా దేశాలలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి మొదలయింది. ఇప్పటికే కొన్ని చోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికారుల తెలిపారు. అయితే ఆసియా ప్రాంతంలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
ఆసియా దేశాల్లో...
హాంకాంగ్, సింగపూర్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రజల్లో ఇమ్యునిటీ తగ్గడం వల్లనే ఈ కరోనా కేసులు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా లేకపోతే మరింత విస్తరించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మాస్క్ లు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ప్రజలుబూస్టర్ డోసులు తీసుకోవాలని అధికారులు కోరారు.