మిస్‌ వరల్డ్‌ టైటిల్ ను సొంతం చేసుకున్న థాయ్‌లాండ్‌ సుందరి

మిస్ వరల్డ్ పోటీల్లో 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు.

Update: 2025-06-01 07:37 GMT

మిస్‌ వరల్డ్‌ టైటిల్ ను థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్‌ సుచాత చువాంగ్‌ ఎగరేసుకుపోయింది. మిస్ వరల్డ్ పోటీల్లో 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. 2024 లో మిస్‌ వరల్డ్‌గా నిలిచిన క్రిస్టినా పిజ్కోవా, 72వ ప్రపంచ సుందరి ఓపల్‌ సుచాత చువాంగ్‌కు కిరీటాన్ని అలంకరించి, శుభాకాంక్షలు తెలిపారు.


మిస్ వరల్డ్‌గా ఎంపికైన ఓపల్ సుచాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. సుచాత థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించారు. మిస్‌ వరల్డ్‌ థాయ్‌లాండ్‌ 2025ను గెలిచుకున్న ఆమె తాజా పోటీల్లోనూ తన అందం, అభినయం, ప్రతిభతో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.

Tags:    

Similar News