పార్లమెంట్ లో పోర్న్ వీడియోలు చూసిన ఎంపి
ఎంపీ నీల్ పరీశ్ పోర్న్ వీడియోలు చూస్తుండగా.. ఆయన పక్కనే కూర్చున్న మహిళా సభ్యురాలు గమనించి..
బ్రిటన్ : గౌరవనీయమైన, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజానాయకులు.. సత్ప్రవర్తన, అభివృద్ధి పనులతో అందరికీ ఆదర్శంగా నిలవాల్సింది పోయి.. పాడు పనులు చేస్తున్నారు. తాజాగా ఓ ఎంపీ పార్లమెంట్ లో పోర్న్ వీడియోలు చూస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు. ఆ ఎంపీ గురించి తెలిసిన వారంతా మొహంమీదే ఛీ కొడుతున్నారు. అయితే.. ఈ ఘటన జరిగింది మనదేశంలో కాదు.. బ్రిటన్ లో. బ్రిటన్ లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపి నీల్ పరీశ్ (65) పార్లమెంట్ లో అశ్లీల వీడియో చూడటం కలకలం రేపింది.
ఎంపీ నీల్ పరీశ్ పోర్న్ వీడియోలు చూస్తుండగా.. ఆయన పక్కనే కూర్చున్న మహిళా సభ్యురాలు గమనించి.. వెంటనే స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఎంపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎంపీ నీల్ పరీశ్ తీరుపై విపక్షాలే కాదు సొంత పార్టీ నేతలూ తీవ్రంగా మండిపడుతున్నారు. తనపై తీవ్ర విమర్శలు రావడంతో.. బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశాడు నీల్. అలాగే తన భార్యకు, కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు చెప్పాడు. తనపై వచ్చిన ఆరోపణలపై నీల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. "ఇది తలవంపులు తెచ్చే ఘటనే. నాకు మాత్రమే కాదు. నా భార్య, కుటుంబం అందరూ ఆందోళన పడుతున్నారు. అదృష్టవశాత్తు ఈ విషయంలో నా భార్య నాకు అండగా నిలిచింది. ఆమెకు ధన్యవాదాలు చెప్పాలి" అని నీల్ పరీశ్ అన్నారు.