అష్టాంగ విమాన ఆలయం.. ఒహాయో రాష్ట్ర రాజధానిలో

అమెరికాలో మరో ఆలయం నిర్మితమవుతోంది.

Update: 2025-06-23 09:45 GMT

అమెరికాలో మరో ఆలయం నిర్మితమవుతోంది. ప్రపంచంలోనే నాలుగో 'అష్టాంగ విమాన' ఆలయం ఒహాయో రాష్ట్ర రాజధాని కొలంబస్ లో నిర్మించనున్నారు. సహజంగా ఆలయాల నిర్మాణం పూర్తయ్యాక విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ మాత్రం రెండు, మూడు అంతస్తులు నిర్మించడానికి ముందే అందులో విగ్రహాలను ప్రతిష్ఠించారు. మొదటి అంతస్తులో ఇప్పటికే వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా, రెండో అంతస్తులో యోగా నృసింహస్వామి విగ్రహాన్ని, మూడో అంతస్తులో రంగనాథ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. ఆలయాన్ని 2027 నాటికి పూర్తి చేసి మహాకుంబాభిషేకం చేస్తామని వెల్లడించారు. యోగా నృసింహస్వామి విగ్రహం బరువు 2 టన్నులు, రంగనాథ స్వామి విగ్రహం పడగతో కలిపి 9.5 టన్నులు ఉంది. ఈ విగ్రహాలను భారత్లో తయారు చేయించి అమెరికాకు తీసుకెళ్లారు.

Tags:    

Similar News