మరో యుద్ధం మొదలైంది.. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు

ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది.

Update: 2025-06-13 09:30 GMT

ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలపై, అణు లక్ష్యాలపై దాడులు ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ను 'రైజింగ్ లయన్' అని పేరు పెట్టారు. ఇరాన్ అణ్వాయుధాన్ని పొందేందుకు ఎన్నడూ లేనంత దగ్గరగా ఉంది, ఇరాన్ చేతిలోకి విధ్వంసం చేసే ఆయుధాలు వస్తే ఇజ్రాయెల్ కు, ప్రపంచానికి పెను ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

ఇరాన్‌పై తొలి దశ సైనిక చర్య ముగిసిందని ఐడీఎఫ్‌ దళాలు తెలిపాయి. ఈ దాడులను ఇరాన్‌ కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో అనేకమంది మృతి చెందినట్లు ఇరాన్ మీడియా కూడా వెల్లడించింది. ఇరాన్ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కెర్మాన్‌షా, లోరెస్తాన్‌, టెహ్రాన్‌లలోని పలు ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరిగాయి.

Tags:    

Similar News