ట్రంప్ వదిలేట్లు లేడుగా.. మళ్లీ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని తామే ఆపామని తెలిపారు. యుద్ధ సమయంలో విమానాలు కూల్చేశారని ట్రంప్ అన్నారు. ఐదు జెట్‍లు కూలినట్లు తనకు సమాచారం ఉందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించి మరోసారి వివాదానికి తెర లేపారు. తొలి నుంచి ట్రంప్ తనవల్లనే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలయిందని కూడా గతంలో అన్నారు.
యుద్ధాన్ని ఆపింది...
పాక్, భారత్ దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఇరుదేశాల మధ్య జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపామని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్-పాక్ మధ్య పరిస్థితి తీవ్రమవుతుండగా ట్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ట్రేడ్ డీల్ కావాలంటే యుద్ధం ఆపాలమని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.