Donald Trump : తాజాగా ట్రంప్ చేసిన ట్వీట్ తో తేలిపోయినట్లేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ - పాక్ ఉద్రిక్తతలపై మరోసారి ట్వీట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ - పాక్ ఉద్రిక్తతలపై మరోసారి ట్వీట్ చేశారు. ఇరుదేశాలతో కలసి కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. సంఘర్షణలతో మరణాలు, విధ్వంసం తప్ప ఏమీ ఉండదని ట్రంప్ అన్నారు.
ఇరుదేశాల మధ్య...
భారత్, పాక్ లు రెండు శక్తిమంతమైన దేశాలని, ఆ దేశాల నాయకత్వాలు అర్థం చేసుకుని కాల్పుల విరమణకు అంగీకరించడం శుభపరిణామమని ట్రంప్ అన్నారు. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని కుదిర్చినందుకు తనకు గర్వంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింతగా మెరుగు పర్చుకుంటామని కూడా ట్రంప్ తెలిపారు. కాశ్మీర్ విషయంలో పరిష్కారం కనుగొనగలిగితే అందులో రెండు దేశాలతో కలసి పనిచేస్తానని ట్రంప్ చేశారు