Trump : భారత్ పై అమెరికా సుంకాల మోత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు

Update: 2025-07-31 01:48 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి పెరిగిన సుంకాలు అమలులోకి రానున్నట్లు ప్రకటించారు. రష్యాతో భారత్ వాణిజ్య సంబంధాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ పై భారీ సుంకాలు విధించి ట్రంప్ తన నైజాన్ని చాటుకున్నారు. భారత్ తమకు మిత్ర దేశమంటూనే ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి వస్తువుపై 25 శాతం పలు విధించారు.

జరిమానాలు కూడా...
వీటికి అదనంగా జరిమానాలు కూడా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం భారత్ నుంచి వెళ్లే వస్తువులపై పది శాతం మాత్రమే సుంకాలున్నాయి. అయితే పది శాతంతో కలిపి ఇరవై శాతానికి పెంచారా? లేక పది శాతానికి సుంకానికి అదనమా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ట్రంప్ విధించిన సుంకాలపై భారత్ ప్రభుత్వం స్పందించింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది.


Tags:    

Similar News