Breaking : ఇరాన్ రెండు షరతులకు అమెరికా ఒకే

ఈరోజు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ లో చర్చలు జరగనున్నాయి

Update: 2026-04-11 07:57 GMT

పశ్చిమాసియా ఉద్రిక్తతల నివారణ కోసం ఈరోజు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ లో చర్చలు జరగనున్నాయి. శాంతి చర్చలు జరగనున్నాయి. సంప్రదింపుల ప్రారంభానికి కొన్నిగంటల ముందు టెహ్రాన్ రెండు షరతులు విధించింది. దీనికి అమెరికా అంగీకరించింది. లెబనాన్- ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని, సీజ్ చేసిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేయాలని ఇరాన్ షరతు విధించింది.

మరి కాసేపట్లో చర్చలు...
ఇరాన్ రెండు డిమాండ్లను అమెరికా అంగీకరించడంతో చర్చలు మరికాసేపట్టో జరగనున్నాయి. చర్చల్లో సానుకూలత రాకుండా మొండిపట్టు పడితే దాడులతో ఇరాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరొకవైపు ఇరాన్ లో ప్రజలు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. వీధుల్లోకి వచ్చి యుద్ధం ముగిసినట్లేనని భావిస్తూ మిఠాయిలు పంచుకుంటున్నారు.


Tags:    

Similar News