Donald Trump : భారత్ తో ట్రంప్ స్నేహాన్ని దూరం చేసుకోవాలనుకుంటున్నాడా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ఆగ్రహాన్ని ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నాడు. మళ్లీ మరొకసారి సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2025-09-26 02:33 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ఆగ్రహాన్ని ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నాడు. మళ్లీ మరొకసారి సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు. ఫార్మా దిగుమతులపై ట్రంప్ వంద శాతం సుంకాలను విధించడంతో భారత్ లో ఫార్మా రంగంపై ప్రభావం చూపనుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయిన తర్వాత పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఇష్టారీతిన పన్నులు పెంచడమే కాకుండా అనేక వివాదాస్పదమైన నిర్ణయాలను తీసుకుంటూ మిత్ర దేశాలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మంచిగా మాట్లాడుతూనే అయిన కాడికి వడ్డిస్తూ కోరి వివాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు.

తమ ఉత్పత్తులను ప్రోత్సహించడానికే....
అయితే అమెరికాలో తమ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికేనని ట్రంప్ చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకూ లేని విధంగా ఒక్కసారిగా టారిఫ్ లు పెంచుతూ సుంకాల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై యాభై శాతం అదనపు సుంకాలు విధించిన ట్రంప్ మరోసారి ఫార్మా కంపెనీలు ఎగుమతి చేసే ఉత్పత్తులపై వంద శాతం సుంకాలు విధించడంతో భారత్ తో వివాదానికి కాలు దువ్వుతున్నట్లే కనిపిస్తుంది. బ్రాండెడ్, పేటెంటెడ్ డ్రగ్స్ పై వంద శఆతం విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అప్ హోస్టర్ ఫర్నీచర్ పై ముప్ఫయి శాతం, భారీ ట్రక్కులపై ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు.
అక్టోబరు 1వ తేదీ నుంచి...
పెరిగిన ఈ పన్నులు అక్టోబరు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాలు భారత ఫార్మా కంపెనీలపై భారీ దెబ్బ పడనుంది. స్టాక్ మార్కెట్ పై కూడా ప్రభావం చూపనుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇక ఆగేటట్లు కనిపించడం లేదు. ఇది ఆఖరు కాదు.. మళ్లీ సుంకాల మోత మోగించడం ఖాయమని అంటున్నారు. ఈసారి 150 శాతం నుంచి 250 శాతం వరకూ ట్రంప్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు కనపడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాలో తయారీ ప్లాంట్ నిర్మిస్తున్న కంపెనీలకు మాత్రం మినహాయింపు ఇచ్చినా ఇలా ఇష్టమొచ్చినట్లు ట్రంప్ విధిస్తున్న సుంకాల మోతతో భారత్ తో స్నేహాన్ని ట్రంప్ దూరం చేసుకోవాలని కోరుకున్నట్లే కనపడుతుంది.
Tags:    

Similar News