మొన్న చదువుకోవద్దన్నారు.. ఇప్పుడు ఉద్యోగాలు కూడా మానేయాలని అంటున్నారు

Update: 2022-12-25 02:05 GMT

కొంతమంది మహిళా ఉద్యోగులు హిజాబ్ ను సరిగ్గా ధరించకపోవడంతో.. ఆ మహిళలను సస్పెండ్ చేయమని ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని విదేశీ మరియు దేశీయ ప్రభుత్వేతర గ్రూపులను తాలిబాన్ ప్రభుత్వం శనివారం ఆదేశించింది. కాబూల్ రాజధానిలోని మసీదులలో మతపరమైన తరగతులకు హాజరుకాకుండా మహిళలను నిషేధించారు. ఈ నిషేధాలు మహిళల హక్కులు, స్వేచ్ఛలకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ కొత్త పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు. తాలిబాన్ దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు హాజరుకాకుండా మహిళా విద్యార్థులను నిషేధించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వచ్చింది.

ఆడపిల్లల చదువును అడ్డుకుంటున్నందుకు ఇప్పటికే ఆఫ్ఘన్ మహిళలు తాలిబాన్ లకు వ్యతిరేకంగా ప్రధాన నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. తాలిబాన్ నిర్ణయం అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. NGOలలో మహిళలను తీసివేయాలనే ఆర్డర్ ఆర్థిక మంత్రి ఖారీ దిన్ మహ్మద్ హనీఫ్ నుండి వచ్చినట్లు తెలిపింది. ఈ ఆర్డర్ను పాటించని ఏదైనా సంస్థ ఆఫ్ఘనిస్తాన్లో వారి ఆపరేటింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పుకొచ్చారు. NGOల కోసం పనిచేసే మహిళా సిబ్బంది "సరైన" హెడ్స్కార్ఫ్ లేదా హిజాబ్ ధరించకపోవడంపై ఎన్నో ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ ఆర్డర్ అందరు మహిళలకు వర్తిస్తుందా లేదా NGOలలో పనిచేసే ఆఫ్ఘన్ మహిళలకు మాత్రమే వర్తిస్తుందా అనేది స్పష్టంగా తెలియలేదు. తాజా తాలిబాన్ చర్య ఆఫ్ఘన్ మహిళలను ఇంటికే పరిమితం చేయాలనే మరో చర్యగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఈ నిర్ణయాలను పలువురు NGO సభ్యులు, మహిళలు ఖండిస్తూ ఉన్నారు. "మేము మనుషులం కాదా? వారు మాతో ఎందుకు ఇంత క్రూరత్వంతో ప్రవర్తిస్తున్నారు?" అని ప్రశ్నిస్తున్నారు ఆఫ్ఘన్ మహిళలు.


Tags:    

Similar News