ఉగ్రవాదుల దాడి - ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి

పాకిస్తాన్ – శ్రీలంకలతో వచ్చే నెల జరగాల్సిన దేశీయ క్రికెట్‌ సిరీస్‌ నుంచి అఫ్ఘానిస్తాన్‌ వైదొలిగింది

Update: 2025-10-18 02:55 GMT

పాకిస్తాన్ – శ్రీలంకలతో వచ్చే నెల జరగాల్సిన దేశీయ క్రికెట్‌ సిరీస్‌ నుంచి అఫ్ఘానిస్తాన్‌ వైదొలిగింది. తూర్పు పక్తికా ప్రావిన్స్‌లో ముగ్గురు స్థానిక క్రికెటర్లు ఉగ్రదాడిలో మృతిచెందిన ఘటన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఫ్ఘాన్‌ క్రికెట్‌ బోర్డు శుక్రవారం వెల్లడించింది. ఉర్గూన్‌ నుంచి షరనా వరకు స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లిన క్రీడాకారులు తిరిగి వచ్చిన అనంతరం జరిగిన సమావేశం సమయంలో వారిపై దాడి జరిగిందని బోర్డు తెలిపింది. పాకిస్తానీ పాలక వ్యవస్థ ప్రణాళికాబద్ధంగా జరిపిన పిరికిపంద దాడి ఇది అఫ్ఘాన్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొంది.

క్రికెట్ సిరీస్ నుంచి...
కబీర్‌, సిబ్ఘతుల్లా, హరూన్‌గా గుర్తించిన ముగ్గురు క్రికెటర్లతో పాటు మరో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. ఈ దాడి వివరాలను మాత్రం బోర్డు వెల్లడించలేదు. ఇది అఫ్ఘాన్‌ క్రీడా సమాజానికి, క్రీడాకారులకు, క్రికెట్‌ కుటుంబానికి గొప్ప నష్టమని ఏసీబీ సంతాపం వ్యక్తం చేసింది. బాధితుల పట్ల గౌరవ సూచకంగా ట్రై సిరీస్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. రపరాధులను, మన స్థానిక ఆటగాళ్లను హతమార్చిన ఈ దారుణాన్ని క్షమించలేమనిని అఫ్ఘాన్‌ ఆటగాడు ఫజల్హక్‌ ఫారూకీ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ‘


Tags:    

Similar News