America : గవర్నర్, మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయం.. అదే సంకేతమా?
అమెరికాలో ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్లు ఓడిపోయారు
అమెరికాలో ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్లు ఓడిపోయారు. డెమొక్రాట్లు విజయం సాధించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఈ అపజయానికి కారణాలుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. ట్రంప్ పై ఎంత మేరకు అసంతృప్తి ఉందో ఈ ఎన్నికల ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వ్యక్తమయింది. గెలిచిన దగ్గర నుంచి డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం అమెరికన్లకే కాకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడి వారికి ఇబ్బంది కలిగించాయి. దీంతో వారు ఈ ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా అభిప్రాయాన్ని వెల్లడించారు.
వర్జీనియాలో జరిగిన...
వర్జీనియాలో గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రాట్ అబిగెయిల్ స్పాన్‌బర్గర్ ఘనవిజయం సాధించారు. రిపబ్లికన్ లెఫ్టినెంట్ గవర్నర్ విన్‌సమ్ ఎర్ల్ సియర్స్‌ను మంగళవారం ఓడించి రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికయ్యారు. దీంతో డెమోక్రాట్లకు 2026 మధ్యంతర ఎన్నికలకు ముందే కీలక బలం లభించిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. స్పాన్‌బర్గర్ రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా గవర్నర్‌గా నిలిచారు. ఈ విజయంతో గవర్నర్ పదవి రిపబ్లికన్ గ్లెన్ యంగ్కిన్ నుంచి డెమోక్రాట్లకు మారనుంది. డెమోక్రాట్ అభ్యర్థఇ ఘజాలా ఎఫ్. హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా విజయం సాధించారు. ఆమె అమెరికాలో రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో గెలిచిన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు.
వర్జీనియా ఆర్థిక వ్యవస్థపై...
సీఐఏ మాజీ అధికారి, కాంగ్రెస్ మాజీ సభ్యురాలైన స్పాన్‌బర్గర్ ఎన్నికల్లో ఆర్థిక సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకున్నారు. ట్రంప్ విధానాలు వర్జీనియా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రజలకు వివరించారు. రిపబ్లికన్ ఆధిపత్య ప్రాంతాల్లోనూ ప్రచారం చేసి, గర్భస్రావ హక్కుల పరిరక్షణకు మద్దతు తెలపడం ద్వారా కీలక ఓటర్లను ఆకర్షించారు. ట్రంప్ పాలనలో ప్రభుత్వ కార్యాలయాల మూసివేత, పౌర సేవా ఉద్యోగుల కోతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ విధానాల వల్ల వేలాది ఫెడరల్ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమతుల్య విధానం వల్ల మధ్యతరగతి, స్వింగ్ ఓటర్ల మద్దతు లభించింది.ఎర్ల్ సియర్స్‌పై స్పాన్‌బర్గర్ సాంస్కృతిక అంశాలపై దాడులు తిప్పికొట్టారు.