కేరళ యువతికి బంపర్ ప్రైజ్.. కోట్ల రూపాయలు

కేరళకు చెందిన ఒక యువతికి 44 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.

Update: 2022-02-06 03:09 GMT

లాటరీ అంటేనే అదృష‌్టం. ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పలేం. కేరళకు చెందిన ఒక యువతికి 44 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. సౌదీ దేశాల్లో లాటరీలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఈ నెల 3వ తేదీన అబుదాబీ వీక్లీ డ్రాలో కేరళకు చెందిన లీనా జలాల్ కు భారీ ప్రైజ్ మనీ లభించింది. 22 మిలియన్ల దీరామ్స్ ఆమె గెలుచుకుంది. లీనా గెలుచుకున్న టిక్కెట్ విలువ మన దేశం కరెన్సీలో 44 కోట్లు.

సహచరులతో కలసి....
జలాల్ లీనా కేరళ రాష్ట్రంలోని త్రిచూర్ లోని అంజన్ గడి ప్రాంతానికి చెందిన వారు. నాలుగేళ్లుగా ఆమె అబుదాబిలో ఉద్యోగ రీత్యా నివాసముంటున్నారు. తన సహచరులతో కలసి ఆమె టెరిఫిక్ 22 మిలియన్ సిరీస్ 236లో టిక్కెట్ ను కొనుగోలు చేశారు. ఈ టిక్కెట్ కు ప్రైజ్ మనీ లభించింది. టిక్కెట్ ను తొమ్మిది మంది సహచరులతో కొనుగోలు చేయడంతో ప్రైజ్ మనీ కూడా అందరితో కలసి పంచుకోనున్నారు.


Tags:    

Similar News