Sudan : ఘోర విపత్తు.. వెయ్యి మందికి పైగా మృతి
సూడాన్ లో ఘోర విపత్తు సంభవించింది. విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి దాదాపు వెయ్యి మందికిపైగా మరణించారు.
సూడాన్ లో ఘోర విపత్తు సంభవించింది. విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి దాదాపు వెయ్యి మందికిపైగా మరణించారు. ఆఫ్రికా దేశం సూడాన్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక గ్రామం మొత్తం వాటికింద సమాధి అయింది. ఈ ఘటనలో వెయ్యికి మందికి పైగా ప్రజలు మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.అందులో ఒక్కరే బతికి నట్లు అధికారులు తెలిపారు.
కొండచరియలు విరిగిపడి...
కొండచరియలు విరిగిపడి గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోగా వెయ్యి మందికి పైగా మరణించారని సూడాన్ లిబరేషన్ మూమెంట్ ధ్రువీకరించింది. అధికారిక ప్రకటన చేసింది. గత నెల 31వ తేదీన ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికార యంత్రాంగం తెలిపింది. అయితే ఈ ప్రమాద ఘటనలో ఒక్కరే మతికినట్లు కూడా అధికారులు చెప్పటం విశేషం. కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని, కొండ రాళ్ల కింద అనేక మంది సమాధి అయ్యారని తెలిపింది.
మర్రా పర్వతాల ప్రాంతంలో...
దీంతో సూడాన్ లో విషాదం నెలకొంది. ఇంతటి ప్రకృతి వైపరీత్యం సంభవించడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. మర్రా పర్వతాల ప్రాంతంలో గ్రామం కనిపించకుండా పోవడంతో వారికి చెందిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యి మంది అంటున్నారు కానీ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. నిద్రలో ఉండగానే జరగడంతో గ్రామంలో ఎవరూ తప్పించుకోలేకపోయారని, అందువల్లనే ఇంతటి ఘోర విపత్తు సంభవించిందని అధికారులు చెబుతున్నారు.