5 రూపాయల పార్లెజీ బిస్కెట్ ప్యాకెట్.. అక్కడ 2400 రూపాయలు
భారతదేశంలో 5 రూపాయలకే దొరికే పార్లే-జీ ప్యాకెట్ గాజాలో మాత్రం ఏకంగా 2400 రూపాయలకు విక్రయిస్తున్నారు.
భారతదేశంలో 5 రూపాయలకే దొరికే పార్లే-జీ ప్యాకెట్ గాజాలో మాత్రం ఏకంగా 2400 రూపాయలకు విక్రయిస్తున్నారు. అక్కడ నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకాయి. యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. సరైన తిండి లేక ఆకలితో అలమటించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధం కారణంగా సరిహద్దులను మూసివేశారు. దీంతో నిత్యావసర వస్తువులు అందక అక్కడ తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అక్కడ లభించే తినే వస్తువులు కొన్ని వందల రెట్లు ఎక్కువకు అమ్ముతూ ఉన్నారు.