భారీ భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు

మలేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతగా నమోదయింది

Update: 2022-03-14 02:47 GMT

మలేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతగా నమోదయింది. ఒక్కసారి భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. అర్థరాత్రి సంభవించడంతో ఎక్కువ మంది గాఢ నిద్రలో ఉన్నారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ నైరుతి దిక్కులో 504 కిలోమీటర్ల దూరంలో భూకం కేంద్రాన్ని గుర్తించారు

రెండు దేశాల్లోనూ....
మరోవైపు ఫలిప్పీన్స్ , ఇండోనేషియోలో కూడా భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ లో రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రతగా నమోదయింది. మనీలా నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ఇక ఇండోనేషియో లో వచ్చిన భూకంప తీవ్రత 6.6 గా నమోదయింది. అయితే ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.


Tags:    

Similar News