Hyderabad : బ్రేకప్ అయిందని యూట్యూబర్ బలవన్మరణం

ప్రేమించి పెళ్లికి యువకుడు నిరాకరించడంతో యూట్యూబర్ బలవన్మరణం పొందింది

Update: 2026-02-25 05:50 GMT

ప్రేమించి పెళ్లికి యువకుడు నిరాకరించడంతో యూట్యూబర్ బలవన్మరణం పొందింది. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన జరిగింది.చిత్రపురి కాలనీలో నివాసముంటున్న వైజాగ్‌కు చెందిన కోమలి వీడియోలు, రీల్స్ చేస్తూ యూట్యూబర్‌గా ఫేమస్‌ అయ్యారు. మరో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అఖిల్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది.

పెళ్లికి నిరాకరించడంతో...
పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకుందామని కోమలి అఖిల్ రెడ్డిపై వత్తిడి తేగా పెళ్లికి మొఖం చాటేశాడు. దీంతో జీవితం మీద విరక్తి చెందిన కోమలి బలవన్మరణానికి పాల్పడింది. ఆరు నెలల క్రితమే ప్రాణాలు తీసుకోబోయిన కోమలి అప్పుడు ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడు బలవన్మరణంతో మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె మరణం వెనక అఖిల్ రెడ్డి ప్రమేయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని కోమలి ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకుని చివరిగా ఎవరెవరితో మాట్లాడిందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.


Tags:    

Similar News