Hyderabad : తుది దశకు హైదరాబాద్ మెట్రో టేకోవర్
హైదరాబాద్ మెట్రో టేకోవర్ తుది దశకు చేరుకుంది
హైదరాబాద్ మెట్రో టేకోవర్ తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా విధించుకుంది. ఫైనాన్స్ టెక్నికల్ స్టడీ రిపోర్టులు సిద్ధం చేసింది. ఎల్ అండ్ టి నుంచి ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోను టేకోవర్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయింది.
మార్చి 31వ తేదీలోపు...
టెక్నికల్ కన్సల్టెంట్‌గా డీఎంఆర్సీని నియమించారు. ఫైనాన్స్ లీగల్ అడ్వైజర్‌గా ఐడీబీఐ స్టడీ పూర్తయింది. ఎల్ అండ్ టీ బకాయిలపై ప్రభుత్వానికి నివేదిక కూడా అందింది. హెచ్ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీ మధ్య ఒప్పందాల దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నెల 23న కేబినెట్ ముందుకు నివేదికలు రానున్నాయి. కేబినెట్ ఆమోదం తర్వాత మెట్రో టేకోవర్ వేగవంతం కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి 31లోగా మెట్రో టేకోవర్‌కు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించింది.