హైదరాబాద్ లో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు
హైదరాబాద్ లో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పర్యటించనునున్నారు
హైదరాబాద్ లో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పర్యటించనునున్నారు. రెండు రోజుల పాటు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల పర్యటిస్తారు. తెలంగాణలో ఆరోగ్యరంగం బలోపేతం కోసం ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటించనుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు నగరాల్లో హెల్త్ ఫెసిలిటీలకు సంబంధించి అధికారులతో చర్చించనున్నారు.
ఆరోగ్య రంగం బలోపేతం కోసం...
ప్రపంచ బ్యాంకు ను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని తెలంగాణలో మెరుగుపర్చడం కోసం 4,150 కోట్ల రూపాయల రుణాన్ని కోరింది. రుణం కోరిరుణమంజూరు ప్రక్రియలో భాగంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సమావేశాలు నిర్వహించనున్నారు. అధికారులతో సమావేశమై వారు ఇచ్చే నివేదికలను అనుసరించి రుణం మంజూరు సాధ్యమవుతుంది.