Hyderabad : హైదరాబాద్ లో డిజిటల్ అరెస్ట్ కు భయపడి డాక్టర్ మృతి

హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ కు భయపడి ఒక మహిళ వైద్యురాలు మరణించింది

Update: 2025-09-17 12:27 GMT

హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ కు భయపడి ఒక మహిళ వైద్యురాలు మరణించింది. తన తల్లి మృతికి సైబర్ నేరగాళ్లు కారణమంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు కుమారుడు ఫిర్యాదు చేశారు. మధురానగర్ లో పదవీ విరమణ చేసిన వైద్యురాలు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు వరసగా బెదిరించారు. మనీలాండరింగ్ డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని బెదిరించారు.

పదే పదే బెదరిస్తూ...
దీంతో మహిళ వైద్యురాలు 6.5 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లకు పంపారు. అయినా సైబర్ క్రైమ్ నేరగాళ్ల బెదిరింపులు ఆగలేదు. దీంతో విశ్రాంతవైద్యురాలు భయపడి గుండె ఆగి మరణించిందని ఆమె కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడవద్దని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు


Tags:    

Similar News