Murder : హైదరాబాద్ లో దారుణం...మహిళ, బాలుడు హత్య
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఒక మహిళ, బాలుడు హత్యకు గురయ్యారు
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఒక మహిళ, బాలుడు హత్యకు గురయ్యారు. ఈ ఇద్దరిని ఒక వ్యక్తి హత్య చేసి తాను కూడా గొంతుకోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించిన ఘటన సంచలనం కలిగించింది. తెల్లాపూర్ లోని జ్యోతిరావు పూలే కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివరాజ్, చంద్రకళ అనే ఇద్దరు ఐదుు రోజుల క్రితం ఇక్కడకు వచ్చి నివాసముంటున్నారు. అయితే వీరు స్థానికులతో దంపతులుగా పరిచయం చేసుకున్నారు.
కుటుంబ కలహాలేనా?
కానీ శివరాజ్ అనే వ్యక్తి చంద్రకళతో పాటు బాలుడిని హత్య చేసి తాన కూడా బ్లేడుతో గొంతుకోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించారు. విషయాన్నిస్థానికులు పోలీసులు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు శివరాజ్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహిళ, బాలుడి మృదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు.