కాంగ్రెస్ సభ సందర్భంగా నగరంలో ఫ్లెక్సీల కలకలం
హైదరాబాద్ లో కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి నేడు జరుగుతున్న సమయంలో నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి
హైదరాబాద్ లో కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి నేడు జరుగుతున్న సమయంలో నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఈసభకు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి అగ్రనేతలు నగరానికి చేరుకున్నారు. ఈ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.
ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై...
జైభీం, సంవిధాన్ అంటూ కాంగ్రెస్ పార్టీ సభకు వ్యతిరేకంగా ెలిసిన ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. కావాలనే కొందరు ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, వారెవరో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. పోలీసులు కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఎవరన్నదానిపై సీసీ టీవీకెమెరాల ద్వారా పరిశీలించిచర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.